తాసిల్దార్ ఆంజనేయులు, ఎస్సై రంజిత్ రెడ్డి
కౌడిపల్లి జనవరి 25 (సిరి న్యూస్) :
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పౌరులకు వజ్రాయుధం లాంటిదని తాసిల్దార్ ఆంజనేయులు, ఎస్సై రంజిత్ రెడ్డి ,లు అన్నారు. శనివారం 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ స్థానిక బస్టాండ్ వద్దకు నిర్వహించారు. కార్డులు చేత పట్టుకొని విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు అనంతరం బస్టాండ్ ఆవరణలో మానవహారం నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు .
ఈ సందర్భంగా తాసిల్దార్ ఆంజనేయులు ఎస్సై రంజిత్ రెడ్డి ,లు మాట్లాడుతూ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఓటు ద్వారా అవినీతి లేని పాలనను నిర్మించుకోవచ్చు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థి దశ నుండే ఓటు , ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవాల్సిన ఎంతైనా ఉందన్నారు . తెలిపారు.
ఈ కార్యక్రమంలో , ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట సుబ్బయ్య ,డిప్యూటీ తాసిల్దార్ మహమ్మద్ జహీర్, ఆర్ ఐ శ్రీహరి, కళాశాల అధ్యాపక బృందం ,విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.