సంగారెడ్డి సెంట్రల్ జైలు కందిలో ఆకస్మికంగా తనిఖీ..

Sudden inspection in Sangareddy Central Jail Kandi..
Sudden inspection in Sangareddy Central Jail Kandi..

సంగారెడ్డి : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి , సుచనలతో జిల్లా న్యాయ సేవాాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ గారు సెంట్రల్ జైలు కంది నందు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది.

ఈ తనిఖీ నందు న్యాయమూర్తి సెంట్రల్ జైలు నందు ఉన్న బెరక్లూ, గదులు, వంట గది, మరియు బాత్రూంలు జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించి ఖైదీలను జైలులో ఉన్న సదుపాయాలను, భోజనం గూర్చి అడిగి తెలుసుకున్నారు అన్ని ఖైదీలు బెరక్లూ క్షున్నంగా పరిశీలించి వారికీ కావాల్సిన అవసరాలు, సదుపాయాలు అన్ని అందించేలా చూడాలని జైలు సూపరింటెండెంట్ గారికి తెలియజేసారు. మరియు వారికీ ఖైదీలతో వారికీ సమయానికి బైల్స్, ములాఖత్ అందుతున్నాయ, కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలియపరిచారు.

మరియు ఖైదీలకు పెడుతున్న భోజనం రుచి చూడడం జరిగినది ఖైదీల కోసం వన్డే కూరగాయలు, బియ్యం, ఉన్న రూమ్ ని కూడా తనిఖీ చేయడం జరిగింది. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా పరిశీలించడం జరిగింది. ఈ తనిఖీ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ గారు , జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.