శివంపేట్ ఫిబ్రవరి 1( సిరి న్యూస్ ) : బీసీ రాష్ట్ర నాయకులు సేవ రత్న అవార్డు గ్రహీత బండారి గంగాధర్ మాట్లాడుతూ మనమెంతో మనకంత అనే నినాదంతో గర్జించవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీసీ రాజకీయ యుద్ధభేరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విచ్చేయుచున్నారు అని అన్నారు .
వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో హలో బీసీ చలో వరంగల్ ,బిసి రాజకీయ యుద్ధభేరిని జిల్లా బీసీ నాయకులు చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ రాష్ట్ర నాయకులు బండారి గంగాధర్ పిలుపునిచ్చారు.