మెదక్ : విద్యార్థులలో కళా నైపుణ్యం ఎంతో గొప్పదని దానిని అధ్యాపకులు వెలికితీసే దిశగా విద్యాబోధన చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం నాడు చిన్న శంకరంపేట మండలంలో మోడల్ పాఠశాలలో Edu – Fiesta విద్యా ఉత్సవం ఘణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల చిన్న శంకరంపేట్ నందు పిల్లల్లో విద్యా, కళానైపుణ్యాలను వెలికి తీసే ప్రక్రియలో భాగంగా విద్యార్థులు తాయారు చేసిన వివిధ ప్రాజెక్టులు, నమూనాలను పాఠశాల ప్రాంగణంగా ప్రదర్శించారు.
విద్యార్థులు ప్రదర్శించిన సుమారు 250 నమోనాలను ప్రాజెక్టులను కలెక్టర్ ఆస్తక్తిగా పరిశీలిస్తూ విద్యార్థులను ప్రశ్నింస్తూ వారి సామర్థ్యాలను పరీక్షించడం జరిగిందన్నారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల సమాధానాలను వినీ అభినందించారు. విద్యార్థులు కొత్త ఆలోచనలను ప్రదర్శించేందుకు, ఒకరినొకరు నేర్చుకునేందుకు ఈ ప్రాజెక్టు వేదిక అవుతుందని, వారి ఆలోచన విధానాలు తెలుసుకునే అవకాశం ఉందని, విద్యార్థుల ఆసక్తిని చూసి ప్రశంశించడం జరిగిందన్నారు.ఆశంతరం పబ్లిక్ పరిక్షలను రాయబోయే 10వ తరగతి, ఇంటర్మిడియట్ విద్యార్థులకు తగు సూచనలను ఇస్తూ పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా కలెక్టర్ బోధన చేసారు. పట్టుదలను పెంచుకోవాలని ఓటమికి క్రుంగి పోరాదని ఉత్తమ ఫలితాల దిశగా విద్యార్థిని విద్యార్థులు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ వాణి కుమారి, రాజ్ రెడ్డి , శ్రీ మాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు