జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి
ముగిసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
సంగారెడ్డి, జనవరి 23 ( సిరి న్యూస్ ) : విద్యార్థులకు తలెత్తే ఆరోగ్య సమస్యలు చేపట్టాల్సిన జాగ్రత్తలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఇద్దరు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యాధికారి తెలిపారు. శిక్షణ పొందిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆయా మండలాలలో ప్రతి పాఠశాల నుండి ఇద్దరు మధ్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు శిక్షణ పొందిన వారు ఆయా పాఠశాలలో విద్యార్థులకు తలెత్తే ఆరోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ శిక్షణలో పిల్లల ఆరోగ్య సమస్యలకు సంబంధించి 16 మాడ్యూల్స్ పై నిర్వహించినట్లు తెలిపారు. విద్యాశాఖ తరఫున నలుగురు మాస్టర్ ట్రైనర్ తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.