మెదక్ రూరల్ : కబడ్డీ అసోసియేషన్ మెదక్ వారి ఆధ్వర్యంలో పాపన్నపేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ (అండర్ 16) పోటీలలో మాంబోజిపల్లి గీత పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు అద్భుతంగా ఆడి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి రామాంజనేయులు మరియు సెక్రటరీ రామాంజనేయులు అభినందించారు.
ఎంపికయిన విద్యార్థుల వివరాలు:
బాలుర విభాగంలో;
1. శివ కుమార్
2. నిఖిల్
3. దిలీప్ సింగ్
బాలికల విభాగంలో ;
1. సహస్ర
2. రుచిత.
వీరు వికారాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ జిల్లా తరఫున పాల్గొనడం జరుగుతుంది.