వైకుంఠ ఏకాదశికి పటిష్టమైన బందోబస్తు – సిద్దిపేట ఏసీపీ మ‌ధు

సిద్దిపేట, జ‌న‌వ‌రి 9 సిరి న్యూస్ : ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్టమైన బందోబస్తు చేస్తున్నామని సిద్దిపేట ఏసీపీ మధు (ACP Madhu) తెలిపారు. సిద్దిపేట పట్టణం మోహింపుర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముక్కోటి వైకుంఠ ఏకాదశి (vaikunta ekadasi 2025) సందర్భంగా పోలీస్ అధికారులకు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సిద్దిపేట ఏసిపి మధు మాట్లాడుతూ 200 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

దేవుని దర్శనానికి వచ్చే ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటించి ప్రశాంతంగా ఉత్తర ద్వారం నుండి దేవుని దర్శించుకోవాలని సూచించారు. సాధారణ దర్శనం, విఐపి దర్శనం, వివి ఐపి దర్శనం, డోనర్స్ దర్శనం సపరేట్గా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సమావేశంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, రూరల్ సీఐ శ్రీను, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంజయ్య, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.