ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలి
సిడిపిఓలు విధిగా అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలి
బాలింతలు గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలి
సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, ఫిబ్రవరి 6 ( సిరి న్యూస్ ) : అంగన్వాడి సూపర్వైజర్లు సిడిపివోలు టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను హెచ్చరించారు.గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సిడిపివోలు అంగన్వాడీ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, టాయిలెట్స్ పనులు త్వరగా పూర్తి చేయాలి.టాయిలెట్స్ కు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలి ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో మిషన్ భగీరథ త్రాగునీరు ఇబ్బందులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కరెంట్ మీటర్ల కనెక్షన్లు ఏర్పాటుకై ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీ తో సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని సిడిపిఓ లకు సూపర్వైజర్లకు సూచించారు. అంగన్వాడి సూపర్వైజర్లు సిడిపిఓలు ప్రతిరోజు విధిగా తమ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపివోలు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇకమీదట అలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని అన్నారు నారాయణఖేడ్ మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన సంఘటన జిల్లాలో మరి ఎక్కడ జరగకుండా అధికారులు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాలను సురక్షితమైన భవనాలకు తరలించాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కలిసి గ్రామంలో నిర్వహించాల్సిన సమావేశాలు, విధులను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.
అంగన్వాడి కేంద్రాల్లో బాలింతలు గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు సరైన పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని పోషణ అభియాన్ టీములను ఆదేశించారు అంగన్వాడి కేంద్రాల్లో నిర్ణీత సమయానికి, క్రమం తప్పకుండా తల్లిదండ్రులు సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశాలకు సూపర్వైజర్లు, సిడిపిఓ స్థాయి అధికారులు క్రమం తప్పకుండా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐసిడిఎస్ సిబ్బంది వారి విధులను బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి లలిత కుమారి, జెడ్పి సీఈవో జానకి రెడ్డి, డిపిఓ సాయి బాబా, ఈఈ పి ఆర్ జగదీష్, మిషన్ భగీరథ ఈఈ పాష, సంబంధిత శాఖల అధికారులు, జిల్లాలోని సిడిపివోలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.