మెదక్ : మెదక్ మండల పరిధిలోని మాచవరం గ్రామంలో బోగి పండుగ సందడి నెలకొంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లను అలంకరించారు. పోటీపడి మరీ రథం రంగావల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. పిల్లలకు రేగిపండ్లతో స్నానాలు చేయిస్తున్నారు. హరిదాసులతోపాటు అలంకరించిన డూడూ బసవన్నలు ఇంటింటికీ తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ పండగా ప్రతి ఇంటా భోగభాగ్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.