గజ్వేల్ జనవరి 23(సిరి న్యూస్) : క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి అన్నారు. నెహ్రూ యువకేంద్ర సహకారంతో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ క్రీడా పోటీలకు సిద్దిపేట జిల్లా స్థాయి సీనియర్ బాలురు, బాలికల ఎంపికను ప్రారంభించారు. గురువారం రోజు స్వాతంత్య్ర సమర యోధులలో అగ్రగణ్యుడు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పరాక్రమ్ దివస్ సందర్బంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఇందులో జిల్లా స్థాయి సీనియర్ పురుషుల విభాగంలో 16 మంది, బాలికలలో విభాగంలో 18 మంది చొప్పున ఎంపికయ్యారని,వీరు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కు వెళ్లే వరకు క్యాంప్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ గుప్త, ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిని నర్సింహులు, ప్రో కబడ్డీ ప్లేయర్ గంగాధర్ మల్లేశం, కౌన్సిలర్ శ్యామల మల్లేశం, నాగరాజు గౌడ్, కబడ్డీ శిక్షకులు, కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.