సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ప్రారంభించిన డిఎస్‌పి, ట్రస్ట్ ఛైర్మన్ గోవర్ధన్..
గుమ్మడిదల : క్రీడలు శారీర దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పటాన్చెరువు డిఎస్పి రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన గుమ్మడిదల సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ వాలీబాల్ , కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.
పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. క్రీడా పోటీలలో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటమిలు పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. సి జి ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థి దశ నుంచి క్రీడల పట్ల మక్కువ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, తాసిల్దార్ గంగాభవాని, ఎంపీడీవో ఉమాదేవి, ఎస్సై మహేశ్వర్ రెడ్డి ,సూర్యనారాయణ, కాళ్ళ కంటి రవీందర్ రెడ్డి ,ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.