క్రీడలు మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయి..

Sports boosts morale.

ఝరాసంగం : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు పెంపొందుతాయని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు (మాజీ ఎంపీటీసీ) ఎస్.కె హఫీజ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సిద్దపూర్ గ్రామంలో హఫీజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్స్ 11 క్రికెట్ టోర్నమెంట్.ఫైనల్ పోటీలో గుర్రం గట్టు తాండ టీమ్ పై సిద్దాపూర్ ఫ్రెండ్స్ సిసి టీమ్ ల మధ్య పోటీ హోరా హోరాగా సాగింది.

ఫైనల్ గా సిద్దాపూర్ ఫ్రెండ్స్ సిసి విజయం సాధించింది. విజేతగా నిలిచిన టీంను 50 వేల నగదు తో పాటు కప్పును అందించారు. ద్వితీయ బహుమతిగా గుర్రం కొట్ట తండా ను 25 వేల నగదుతో పాటు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ విరమని సంగారెడ్డి, నాయకులు భద్రారెడ్డి, రామ్ రెడ్డి, యువ నాయకులు, ఆర్గనైజర్ దత్తారెడ్డి, మొహిజ్, శ్రీకాంత్, దినాకర్, సద్దాం, శ్రీను, క్రికెట్ అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.