ఎస్ పి ఎల్ సీజన్ 5 క్రికెట్ పోటీలు ప్రారంభం

చౌటకూర్‌, జనవరి 11 సిరి న్యూస్ : చౌటకూర్ మండలం బద్రి గూడెం (Badri Gudem) గ్రామం లో సుల్తాన్పూర్ ప్రీమియర్ లీగ్ (ఎస్ పి ఎల్) (SPL) సీజన్ 5 క్రికెట్ క్రీడోత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ క్రికెట్ క్రీడోత్సవాలను పుల్కల్ ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్లోళ్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులు గా హాజరై ప్రారంభించారు.

సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ యువనేత విభాగం మండల అధ్యక్షుడు బండ్ల విట్టాల్ రెడ్డి పట్లోళ్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సుల్తాన్పూర్ ప్రీమియర్ లీగ్ ఎస్ పి ఎల్ పేరుతో ప్రతి ఏటా క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహిస్తుంటారు.