సంగారెడ్డి, జనవరి 16 ( సిరి న్యూస్ ) : కంది మండలం కలివేముల గ్రామంలో శ్రీవెంకట లక్ష్మమ్మ, భూలక్ష్మమ్మ జాతర మహోత్సవం (Bhoolakshmamma Jatara Mahotsavam)లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మ వారికి జగ్గారెడ్డి (Jaggareddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవంలో టిపిసిసి కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ నర్సింలు కాంగ్రెస్ నాయకులు కొన్యాల రాజేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ మహేందర్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.