పెద్ద శంకరంపేట : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని పెద్ద శంకరంపేట లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, నిర్వహించారు. ఆలయ ధర్మకర్త విగ్రా o శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. వేకువ జాము నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారిని ప్రత్యేక అలంకరణలో, ఆలయాన్ని వివిధ రకాల పూలతో, అరటాకులతో, కొబ్బరి మట్టలతో, మామిడి కొమ్మలతో,విద్యుత్ దీపాలతో, సర్వాంగ సుందరంగా అందంగా అలంకరించారు. పేట ఎస్ఐ శంకర్, మాజీ ఎంపిటిసి సుభాష్ గౌడ్, దాదిగారి గంగాధర్, గంగాధర్ గౌడ్, మహంకాళి కృష్ణమూర్తి, భూమేశ్వర్ గౌడ్, అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.