శ్రీ గురు పీఠం ఫౌండర్ అండ్ చైర్మన్, భగలాముఖి ట్రస్ట్ సభ్యులు, పెద్ద గోని జిన్నారం శివకుమార్ గౌడ్..
శివంపేట్ : మెదక్ జిల్లా శివంపేట మండలం లో పౌర్ణిమ రోజున బగలాముఖి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, భగలాముఖి శక్తి పీఠం దేవాలయంలో సంతోష్ శర్మ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కీర్తిశేషులు జిన్నారం పెద్దగోని అంజమ్మ లింగయ్య గౌడ్ జ్ఞాపకార్థం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. శ్రీ బగలాముఖి ఆలయ నిర్వాహకుడు జిన్నారం పెద్ద గొని సూర్యకుమార్ గౌడ్, భగలాముఖి శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులు పబ్బ మహేష్ గుప్తా, శివంపేట గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ రాజిపేట పద్మ వెంకటేశ్వర్, తాజా మాజీ వార్డు సభ్యులు మరియు పబ్బ మహేష్ గుప్త యువసేన సభ్యులు శివంపేట్ మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.