ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి శనివారం కుటుంబ సమేతంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి కి రుద్రాభిషేకం నిర్వహించారు.ఆలయ ఆవరణలోని అమృత గుండంలో జల లింగానికి ప్రత్యేక పూజలు చేసి గుండం పూజా నిర్వహించారు.ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి,జహీరాబాద్ రూలర్ సిఐ హనుమంతు,ఎస్.ఐ టి.నరేష్,ఆలయ రికార్డ్ అసిస్టెంట్ లు,రమేష్,వీరన్న తదితరులు ఉన్నారు.