ప్రాథమిక పాఠశాల తనిఖీ..జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు..
గుమ్మడిదల : మండల కేంద్రమైన గుమ్మడిదలలో కస్తూర్బా గాంధీ పాఠశాల భవన నిర్మాణంకు స్థల సేకరణను జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. వెంకటేశ్వర్లు పరిశీలించారు. బుధవారం గుమ్మడిదల మున్సిపాలిటీలోని 109 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిని కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణంకు స్థలమును పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.
ఉపాధ్యాయుల పనితీరులో భాగంగా విద్యార్థుల అభ్యాస దీపికలను తనిఖీ చేశారు. మండల వనరుల కేంద్రాన్ని కూడా సందర్శించి ఆఫీసు సిబ్బందితో అపార్ జనరేషన్ మరియు మధ్యాహ్న భోజన పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ ఆర్ ఎస్ పైన ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ ఈ డబ్ల్యూ ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెనాన్, మండల విద్యాధికారి రాంబాబు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు తదితరులు పాల్గొన్నారు