సిరి ఎఫెక్ట్‌… క‌ల్ప‌గూర్ గ్రామంలో మ‌ర‌మ్మ‌తు ప‌నులు

గ్రామాన్ని సంద‌ర్శించిన డీఎల్పీవో, కార్య‌ద‌ర్శి
త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం

సంగారెడ్డి టౌన్‌, జనవరి 7 (సిరి న్యూస్) : సంగారెడ్డి మండ‌లం క‌ల్ప‌గూర్ గ్రామం(Kalpagur village)లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై సిరి దిన‌ప‌త్రిక ప్ర‌చురించిన ప‌లు క‌థ‌నాల‌కు అధికారులు స్పందించారు. గ్రామంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు అధికారులు ముందుకొచ్చారు. గ్రామంలో వీధిలైట్ల ఏర్పాటు, క‌ల్వ‌ర్టుల మ‌రమ్మ‌తు (Repair of culverts), ప‌గిలిన పైపులైన్ల ఏర్పాటు చేయించ‌డం జ‌రిగింద‌ని డీఎల్పీవో అనిత‌, గ్రామ కార్య‌ద‌ర్శి శార‌ద తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో సిబ్బంది కొరత ఉన్న కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధిలైట్లు, మురికి కాలువలు, గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రకృతి వనం వెళ్లే దారిలో పైపులైన్ పగిలిపోవడంతో అక్కడి నుండి వెళ్లే కాలనీ ప్రజలు ఇన్నాళ్లు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డామని మరికొంత చేయాల్సి ఉన్నందున త్వరలోనే పూర్తి చేస్తామని డిఎల్పిఓ అనిత పేర్కొన్నారు. శ్రీ సాయి వెంకటేశ్వర ఎన్ క్లేవ్ రోడ్లు వీధిలైట్లు, మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. మంగళవారం డీఎల్పీవో అనిత‌, కార్య‌ద‌ర్శి శార‌ద శ్రీ సాయి వెంకటేశ్వర ఎన్ క్లేవ్ సందర్శించారు. వీధిలైట్లు తక్షణమే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పగిలిన పైపులైన్‌ బాగు చేయాలని ఆదేశించారు.