కేసీఆర్ ప‌దేళ్ల‌పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువు..

Siddipet Congress president Attu Imam comments on kcr
Siddipet Congress president Attu Imam comments on kcr

. నేరచరిత్రలో మొదటి స్థానం బిఆర్ఎస్ నాయకులదే..
. బంగారు తెలంగాణ పేరిట లక్షల కోట్లు దోచుకున్నారు..
. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి సంక్షేమం..
. రేవంత్ రెడ్డి పాల‌న‌లో ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నా..
. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు..
. పాల సాయిరాం నిజాయితీపరుడిలా మాట్లాడుతున్నాడు..
. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు నువ్వు చేసిన అక్రమాలు ప్రజలకు తెలియదా..
. మండిప‌డ్డ సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్..

సిద్దిపేట‌ : 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఖజానాను దోచుకుని బిఆర్ఎస్ నాయకులు నేరచరిత్రలో మొదటి స్థానంలో నిలిచారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మహిళలకు పేద దళిత ప్రజలకు భద్రత కరువైందని కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి చింతన లేకుండా ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువత పక్కదారి పట్టకుండా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతూ కట్టడి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా డ్రగ్స్ గంజాయి ఎక్కువయ్యాయని యువత పక్కదారి పట్టి తమ విలువైన జీవితాలను కోల్పోయారని అన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ పేరిట లక్షల కోట్లు కల్వకుంట్ల కుటుంబం దోచుకొని తిన్నదని అవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకు కక్కించి కటకట పాలు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే వెనక్కి తగ్గదని అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లు అని అన్నారు.

ప్రత్యేక విజన్ తో అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించేముందు బిఆర్ఎస్ నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని అన్నారు. పాల సాయిరాం నిజాయితీపరుడిలా మాట్లాడుతున్నాడు అని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు నువ్వు చేసిన అక్రమాలు ప్రజలకు తెలియదా అని అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీకు లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కేదారి మధు. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు సలీం ఫయాజుద్దీన్ ఫయాజ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.