నారాయణఖేడ్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందజేసిన బంజారా సేవాలాల్ సంఘo నాయకులు.కరీంనగర్ కేంద్రంలో బంజారా సేవాలాల్ సంఘ నాయకులు కలిసి సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,ని కలవడం జరిగిందన్నారు. వారు సానుకూలంగా స్పందించి సంఘ నాయకులకు అభినందించారు. చాలా మంచి కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది నేను కూడా ప్రధానమంత్రి గారితో హోంశాఖ మంత్రి గారితో మాట్లాడి సెలవు దినం ప్రకటించే విధంగా కృషి చేస్తానని తెలపడం జరిగిందన్నారు.
అందుకు సంఘ నాయకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుప్యారు. ఎన్నో రోజుల నుంచి సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగ ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించనైనది కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా సెలవు దినం ప్రకటించలేదు కావున ఎన్డీఏ ప్రభుత్వం బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగ ప్రకటించి యావత్ భారత దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల పై చిలుకుగ ఉన్న జనాభాను దృష్టిలో ఉంచుకొని వారికి ఫిబ్రవరి 15న సేలువదినం ప్రకటించాలని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బంజారా సేవాలాల్ సంఘ మెదక్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్, బిఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్ సింగ్ నాయక్, రాజు నాయక్, శభాష్ జాదవ్, రెడ్యా నాయక్,మోహన్ నాయక్, శ్రీనివాస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.