– ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దు
– ఫోన్‌లలో ఓటీపీ, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించొద్దు
– సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు డయల్ చేయాలి
– ఎస్ఐ శ్రీచైతన్య కుమార్ రెడ్డి
చేగుంట, జనవరి 1 సిరి న్యూస్ : సైబర్ నేరాల పట్ల ప్రజలు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు.జిల్లా ఎస్ పి ఉదయ్ కుమార్ రెడ్డి అదేశానుసరం చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంపల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద వాహదారులకు, స్థానికులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు డయల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సత్యం, కానిస్టేబుల్ రాజు, విఠల్,తదితరులు పాల్గొన్నారు