కన్స్యూమర్ రైట్స్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా శారద‌నియామకం

ఐడిఏ బొల్లారం, జ‌న‌వ‌రి 20 (సిరి న్యూస్ ): ప్రపంచ కన్స్యూమర్ రైట్స్ సంస్థ జిల్లా ఉపాధ్యక్షురాలిగా గొల్లగూడ శారద‌ను నియమించారు. సోమవారంనాడు ఆ సంస్థ వ్యవస్థాపక అద్థ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆమెకి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తమ సంస్థ 4 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని త్వరలో అన్ని రాష్ట్రాలలో ప్రారంభిస్తామని, వినియోగదారునికి అవగాహనతో పాటు బాధ్యతలు తెలియజేయడం ప్రధాన కర్తవ్యం అని ఆయన పేర్కొన్నారు.

తనను జిల్లా ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు వినియోగదారులకు అందుబాటులో ఉంటూ తన సేవలందిస్తాని శారదా తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షురాలు అరుణ, ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, ప్రభాకర్, జ్ఞానేశ్వరి, నవీన్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.