మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు

వ్యవసాయానికి యోగ్యం కాని భూముల్లో ఏర్పాటు
అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఈనిర్ణ‌యం
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి, జనవరి 9 ( సిరి న్యూస్ ) : గ్రామీణ ప్రాంతాల చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియం లో మహిళా సంఘాల సభ్యుల చేత సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొనుటకు గురించి లైన్ డిపార్ట్మెంట్ డి ఆర్ డి ఎ డి ఎం కం, సి ఎలక్ట్రిసిటీ డి ఎఫ్ ( ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్) వారితో సమన్వయము చేసుకొని వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల తో కలెక్టర్ మాట్లాడుతూ . స్వయంసహాయక మహిళ సంఘాలు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో 50 గ్రామ సంఘాల ద్వారా కనీసం 150 ఎకరాలలో మొదటి విడతగా చేయాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కు చాలా డిమాండ్ ఉంది అన్నారు. సోలార్ ప్రోగ్రాము లో 150 ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం (వినియోగం లెని ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, దేవాదాయ భూములు, ఫారెస్ట్ భూములు, స్వంత భూములు,) అందుకు అవసరమైన నిధులు చిన్న సంఘం, గ్రామ సంఘం, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య, మరియు స్వంత నిధులు ఏర్పాటు చేసుకోవాలని మరియు సాంకేతిక పరిజ్ఞానం పై శిక్షణలు ఇప్పిస్తామని నిరూప యోగం లోని భూముల వివరాలు ఎమ్మార్వో ద్వారా మహిళా సంఘాల సిబ్బంది తీసుకోని టి ఆర్ డి ద్వారా సమర్పించాలని అలాగే 18 వ తేదీ నాటికీ పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. , వ్యవసాయానికి యోగ్యం కాని భూముల లో సోలార్ పవర్ ప్లాంట్ లో ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడడం కోసం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉంటుందన్నారు . సోలార్ పవర్ ప్లాంట్ లో ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు, మహిళా శక్తి కార్యక్రమం క్రింద ప్రభుత్వం పూర్తి సహకారాలు అందజేస్తుందన్నారు. నాలుగు ఎకరాల పైన ప్రైవేటు భూములు ఉన్న యాజమాన్యాలు ముందుకు వస్తే సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,ఏ పి ఏం లు బ్యాంకు లింకేజీ ప్రోగ్రెస్ ఈనెల ఆఖరి వరకు 100% పూర్తి చేయాలి అని కలెక్టర్ ఆదేశించారు. మహిళలు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు కు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ,ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.