రాబోయే ఎన్నికల్లో చిట్టి మళ్లీ వైపే అన్ని వర్గాల చూపు

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన శైలులో సేవలు..

బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న నరేందర్ రెడ్డి..

అన్ని పార్టీలకు అతీతంగా జడ్పిటిసి అవకాశం కల్పించాలని కోరుతున్న ప్రజలు..

పార్టీ ఏదైనా వ్యక్తిగతంగా అందరి మన్ననలు పొందుతున్న వ్యక్తిగా గుర్తింపు..

రామాయంపేట జనవరి 30 (సిరి న్యూస్) : ఒక పార్టీకి చెందిన వ్యక్తి సాధారణంగా ఆ పార్టీ వ్యక్తులే అభిమానించడం సర్వసాధారణం. అయితే అందుకు భిన్నంగా ఆ వ్యక్తిని అన్ని పార్టీలతో పాటు మండల ప్రజలు అభిమానించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం అవుతుంది. తాను పార్టీలోకి కాకుండా అన్ని వర్ణ వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేయడంతో పాటు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కుల మత పార్టీ వర్గ బేధాలు లేకుండా సేవలు చేస్తూ నిత్యం ప్రజలు సేవలు ఉంటున్నారు. ఆయనే రామయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చిట్టిమల్లి నరేందర్ రెడ్డి. గతంలో ఆయన బిఆర్ఎస్ పార్టీకి గ్రామ శాఖ అధ్యక్షునిగా, మండల స్థాయిలో సైతం పలు పదవులు అనుభవించిన వ్యక్తి. అయినప్పటికీ ఆయన పార్టీ అనే భేదం లేకుండా అందరూ తన వారి అని సహృదయంతో ఆపద వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు అండగా ఉండి సేవలు చేయడం జరిగింది. దీంతో రామయంపేట మండలం తో పాటు చుట్టుపక్కల మండలంలో సైతం ఆయన తన గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.

నరేందర్ రెడ్డి చేసిన పలు కార్యక్రమాల పట్ల పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు అధిష్టానం ఆయనకు ఉన్నత స్థానం కల్పించాలని అభిప్రాయం బహిరంగంగా చెప్పడం జరుగుతుంది. నరేందర్ రెడ్డి కి మంచి స్థానం కల్పిస్తే మరింత ఉత్సాహంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీకి అండగా ఉంటామని కార్యకర్తలు సైతం బహిరంగంగా చెప్పడం గమనార్హం. గ్రామస్థాయి నుండి మండల జిల్లా స్థాయికి ఎదిగిన ఇలాంటి నాయకునికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచించి నరేందర్ రెడ్డి కి ఉన్నత స్థానం కల్పిస్తే మంచి భవిష్యత్తు పాటితోపాటు తమకు కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.