చీడపురుగుల పై రైతులకు శాస్త్రవేత్తల అవగాహన

సిరి ఫిబ్రవరి 1హత్నూర : మండలంలోని పన్యాల గ్రామములో శుక్రవారం నాడు ఏరువాక కేంద్రం ( DAATTC) -సంగుపేట్ మరియు వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల శాస్త్రవేత్త ఆధ్వర్యంలో వరి, ఉల్లిగడ్డ,టమాటా మరియు మిరప పంటలపై రోగనిర్ధారణ క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా వరిలో చీడ పీడల మరియు తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు రైతులకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరి పంటలో అక్కడక్కడ కాండం తొలుచు పురుగు గాయ లక్షణాలు గమనించడం జరిగింది, నివారణకు ఎకరాకు కార్బోప్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు ఇసుకలో కలిపి సమానంగా చల్లాలి అని తెలిపారు . ఉల్లిగడ్డ పంటలో తామర పురుగు నివారణకు ఫిఫ్రోనిల్ 2.మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని తెలియజేయడం జరిగింది.

ముఖ్యంగా టమాట పంటలో ఎక్కువగా ఆశించే పాముపొడ తెగుళ్ళ నివారణకు థయోమిథాక్సమ్ 0.3 మి.లీ లీటర్ నీటికి కలిపిసాయంత్రం వేళలో పిచికారి చేయాలి అని అన్నారు.ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిరప పంటలో పైముడత మరియు కిందిముడత ఎక్కువగా ఆశించడం జరిగింది కావున రైతులు పురుగు ఉధృతిని బట్టి డైఫేన్తూరాన్ 1.25 మీ. లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం ( DAATTC) -సంగుపేట్ శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ ( కో ఆర్డినేటర్) , సరిత శాస్త్రవేత్త ఉద్యానవన శాస్త్రం , వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల శాస్త్రవేత్త T.శ్రీజయ మృత్తికా శాస్త్రం, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

.