హత్నూర: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందరి సహకారం ఉండాలని ఉపాధ్యాయులు నరేంద్ర పేర్కొన్నారు. శనివారం హత్నూర మండలంలోని కాసాల గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్ షులకు రూపాయలు ఐదువేల నగదును గ్రామానికి చెందిన యువ నాయకుడు సాకలి సుభాష్ ఆర్థిక సహాయాన్ని అందజేయడం అందజేసినట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాల స్థాయి తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇతర ఇతర వసతులు కల్పించాలనే ఆలోచన ప్రతి యువతకు ఉండాలన్నారు.
స్పోర్ట్స్ షూల కోసం నగదు ఆర్థిక సాయం అందజేసిన సాకలి సుభాష్ ను గ్రామస్తులు అభినందించారు. పాఠశాల విద్యార్థులకు చేసే సహాయం చిన్నదైన అత్యంత సంతృప్తి కలగజేస్తుందని,గ్రామంలోని యువ నాయకులు పాఠశాల అభివృద్ధి కృషికి మరింత సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.