అర్హుల‌కు ప‌థ‌కాలు అంద‌డంలేదు – చంద్ర గౌడ్

మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్

శివంపేట్ జనవరి 23(సిరి న్యూస్ ) : శివంపేట్ మండల కేంద్రంలోని గోమారం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ ప్రత్యేక అధికారి నాగేశ్వర్ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.మెదక్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామసభను బహిష్కరించడం జరిగింది. చంద్ర గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో పూర్తిస్థాయి రుణమాఫీ కాలేదు, అర్హులైన వారికి రేషన్ కార్డు వారి యొక్క పేర్లు రాలేదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హులైన వారికి కాకుండా భూమి ఉన్నవారికి పేరు రావడం సిగ్గుచేటు, వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలలో మహిళలకు ప్రతినెల 2500/- ఇస్తానని ఈ పథకం గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరం. గ్రామసభలో అధికారులతో ప్రజలు రుణమాఫీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారి పేరు లేక వారికి అడిగితే చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి ,గ్రామ టిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.