సిద్దిపేట : సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ(Reddy JAC) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సింగిరెడ్డి శశికళ రెడ్డి(Singireddy Sasikala Reddy) పర్యవేక్షణలో సిద్దిపేట స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు( Muggulu Potilu) నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొని విజేతలు మొదటి బహుమతి అరుణ, రెండవ బహుమతి వసుధ, మూడవ బహుమతి భార్గవి లకు బహుమతులు, వారితోపాటుగా భాగస్వాములు అందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు ఇవ్వబడ్డాయి.
సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కేశిరెడ్డి శశికళ రెడ్డి అధ్యక్షతన బహుమతి అందజేయగా, ఇర్రి ఉమా సురేషన్ రెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ , సింగిరెడ్డి విజయరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్,,వడియాల అర్చన రెడ్డి పట్టణ మహిళా అధ్యక్షురాలు పాల్గొనగా, లక్కిరెడ్డి విజయరెడ్డి కార్యక్రమాన్ని సమన్వయ పరచారు .శైలజ రెడ్డి, తిరుమలరెడ్డి ,సుజాత, పద్మ రెడ్డి మరియు రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ,పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ రెడ్డి యొక్క సమన్వయంతో రెడ్డి జేఏసీ దుర్గారెడ్డి సిద్ధారెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.