అలరించిన రంగవల్లులు..
పోటీపడ్డ గాలిపటాలు..
ఘుమగుమలాడిన పిండి వంటలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా వేడుకలు..
గొబ్బెమ్మలు.. రంగవల్లులు.. పిండి వంటలు.. గాలిపటాల మిళితమే సంక్రాంతి పండుగ. అలాంటి సంక్రాంతి పండుగ సంబరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా జరిగాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా ఆనందంగా పాలుపంచుకున్నారు. పాత దానికి స్వస్తి పలికి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు గాలిపటాలను ఎగురవేస్తూ యువతను ఉత్సాహపరిచారు.