సంగారెడ్డి జిల్లా ఏఎస్పి ని కలిసిన అంబేద్కర్ యువజన సంఘం.. ప్రజా సంఘాల నాయకులు

Sangareddy District ASP met Ambedkar Yuvajan Sangam.. Leaders of Public Associations

సంగారెడ్డి: ఈ నెల 22 న కొండాపూర్ మండల్ హరిదాస్పూర్ గ్రామానికి చెందిన మన్నె సంజీవయ్య వారి కుటుంబ సభ్యులను అదే గ్రామానికి చెందిన మందాపురం వెంకటేశం గౌడ్,సాయి గౌడ్, ప్రశాంత్ గౌడ్,ప్రసాద్ గౌడ్లు గోడ్డలి తో,రాడు పైపు తో దాడి చేసి ఒళ్లంతా గాయాలు చేసిన వారి పై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు మరియు అత్యాయత్నం కింద తక్షణం అరెస్ట్ చేయాలని మరియు బాధ్యతల పక్షాన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్పీ గారు దృష్టికి తేవడంతో విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి డిఎస్పి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఏ ఎస్ పి ని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గాప్రసాద్, డివిఎంసి మెంబర్ కాశ పాగా ఇమ్మయ్య, పెద్దాపురం అశోక్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, ప్రజా సంఘాల నాయకులు గోపులారం ప్రేమానందం, కామగళ్ల నాగరాజు, ఎర్రారం దేవదాస్, ఆందోల్ మల్లేశం జిల్లా అధ్యక్షులు మాల మహానాడు, జోగ్యాల్ల రాజు అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి, దేవదాస్, రవీందర్, కరుణాకర్, బహుజన ప్రసాద్, ప్రశాంత్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.