స్థానిక ఎన్నికలలో పోటీ చేసేందుకు సగరులు సమాయత్తం కావాలి

స్థానిక ఎన్నికలలో పోటీ చేసేందుకు సగరులు సమాయత్తం కావాలి మెదక్ జిల్లా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర పిలుపు

రామాయంపేట జనవరి 17 (సిరి న్యూస్)

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు సగరులు సమాయత్తం కావాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా సగర సంఘం కార్యవర్గ విస్తరణ సమావేశం శుక్రవారం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం సమీపంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు సంధిలా సాయిలు సగర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్ సగర మాట్లాడుతూ రాజకీయంగా ముందడుగు వేయనంత కాలం ఆర్థికంగా వెనుకబాటుకు లోనవుతూనే ఉంటామని తెలిపారు. రాజకీయంలో మొదటి అడుగు స్థానిక సంస్థల ఎన్నికలేనని, సగరులు ఉన్న ప్రతి గ్రామంలో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసిలుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా తప్పకుండా పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో 21 మంది తో కార్యవర్గ విస్తరణ చేపట్టారు. అనంతరం సగర సంఘం రాష్ట్ర కమిటీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మర్కు దత్తాత్రేయ సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లు బంగారి ఆంజనేయులు సగర, రవి సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కు నగేష్ సగర, కోశాధికారి ధ్యాప బాలకిషన్ సగర, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రామారపు యాదగిరి సగర. తదితరులు పాల్గొన్నారు