మండల ప్రత్యేకాధికారి ప్రతాప్ సింగ్.!!
శివంపేట్ జనవరి 26( సిరి న్యూస్) : గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తప్పకుండ అందజేస్తామని మండల ప్రత్యేకాధికారి ప్రతాప్ సింగ్ అన్నారు. ప్రజాపాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం మండలంలోని శబాష్ పల్లి గ్రామంలో పిఎసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీఓ నాగేశ్వర్ లతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు – 49 రేషన్ కార్డులు -49 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 50- రైతుభరోసా -529 లబ్ధిదారులకు ప్రొసిడింగులను అందజేశారు.
ఈసందర్బంగా ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని అర్హులై ఉన్న నిజమైన లబ్ధిదారులకు నిరంతరంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలలో పేర్లు రాని లబ్ధిదారులు మళ్లీ అన్నారు. ఈకార్యక్రమంలో పిఎసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి,మండల సీనియర్ నాయకులు లక్ష్మీకాంతారావు, చింతల కరుణాకర్ రెడ్డి, పులిమామిడి నవీన్ గుప్త, గోమారం మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ పార్వతి సత్యం, అయ్యగారి యాదగిరి, వారాల గణేష్,కములయ్యగారి వెంకటేష్,కాముని శ్రీనివాస్, ఎంపీఓ తిరుపతి రెడ్డి, ఏపీఓ అనిల్ కుమార్,అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.