తండాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు..

RTC bus facilities or serious problems for Thandala students..
RTC bus facilities or serious problems for Thandala students..

రామయంపేట : మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాల, పర్వతాపూర్, దంతేపల్లి, కాట్రియాల తండా విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 40 మంది విద్యార్థులు పలు గ్రామాల నుండి 6 కిలోమీటర్ల దూరంలోని కాట్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉదయం సాయంకాల వేళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు దంతేపల్లి నుండి రామాయంపేట జూనియర్ కళాశాలలో చదువుకోవడానికి వెళ్తున్న సుమారు 15 మంది విద్యార్థులు లక్ష్మాపూర్ గేటు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతిరోజు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.