దివ్యాంగులకు వెంటనే రూ.6000 పెన్షన్ అమలుపరచాలి – దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
పెన్ష‌న్ ప్ర‌తి నెల 1 నుంచి 5వ తేదీలోపు ప‌డేలా చూడాలి
దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం ఆధ్వర్యంలో నిర‌స‌న ర్యాలీ

సిద్ధిపేట, జ‌న‌వ‌రి 6 సిరి న్యూస్ : సిద్దిపేటలోని పాత బస్టాండ్ ముందు దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సమస్యలు అయినటువంటి దివ్యాంగులకు వెంటనే రూ.6000 పెన్షన్ అమలుపరచాలి 12 నెలల నుండి ఆపేసిన 2000 రూపాయలకు కూడా జమతో కలిపి జనవరి నెలలో మొత్తం డబ్బు మా ఖాతాల్లో పడేదాకా ఏమి ఊరుకోం. అలాగే దివ్యాంగులకు సకాలంలో పింఛన్లు అందక ఒక ఇంట్లో భార్య భర్తలైన ఇద్దరు దివ్యాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నెల ఫస్ట్ తారీకు నుండి మొదలు ఐదో తారీకు లోపు పడేలా చూడాలి.

దివ్యాంగులకు గతంలోనే బస్సు పాస్ లో హాఫ్ టికెట్ ఉండడం కారణంగా అదే కార్డు ని పూర్తి ఫ్రీ కార్డుగా మాకు సదుపాయం చేయాలి 2016 సెక్షన్ 92 పటిష్టంగా అమలు చేయాలి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించాలి అలాగే స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేద దివ్యాంగులకు ఇంటి నిర్మాణం చేయించి సకలాంగుల కన్నా ఎక్కువ మొత్తాన డబ్బులు ఇవ్వాలి ప్రతి బస్సులో దివ్యాంగులకు ఒక సీట్ కేటాయించాలి బ్యాంక్ బ్లాక్ పోస్ట్లు వెంటనే భర్తీ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని గుర్తించట్లేదు దివ్యాంగుల రాష్ట్ర కార్పొరేషన్ ముత్తినేని వీరయ్య గారు ప్రతినెల ఒక జిల్లాకు వెళ్లి దివ్యాంగుల సాధకబాధలు తెలుసుకోవాలి దివ్యాంగులపై దాడులు జరుగుతున్నాయి.

కావున ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో మేము పెట్టే కేసు పెట్టిన కేసు లాగా కాకుండా శూన్యంగా పరిశీలించి నిందితులను అరెస్టు చేయాలి అని దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ అన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రేణిగుంట సురేష్ దుబ్బాక టౌన్ ప్రెసిడెంట్ గడ్డమీది లక్ష్మణ్ దుబ్బాక డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు పిట్ల బాబు లచ్చపేట రాకేష్ మహిళా విభాగంలో మహిళా అధ్యక్షురాలు గొడుగు సరూప ఉపాధ్యక్షురాలు సంతోష నర్సింలు సువర్ణ ప్రధాన కార్యదర్శి రాజేష్ ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి లు పాల్గొన్నారు.