పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్
నారాయణఖేడ్ జనవరి 24 (సిరిన్యూస్) : నారాయణఖేడ్ పట్టణంలో అమృత్ 2.0 పథకం ద్వారా మంచినీటి సరఫరా కోసం నిధులు మంజూరయ్యాయి. వాటికి సంబంధించిన పనులకు జహీరాబాద్ ఎంపీ, సురేష్ కుమార్ శేట్కర్, ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ చేశారు. ఈ పథకంద్వారా జర్నలిస్టు కాలనీలో రూ.13కోట్ల 50లక్షలతో వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో వేలకోట్ల రూపాయలను కమిషన్లను దండుకుంది కానీ ఎక్కడ కూడా సరిగ్గా నీరు అందివ్వలేకపోవడం సిగ్గు చేటన్నారు. అలాగే గ్రామాలలో తండాలలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నీటీ సమస్య ఉందన్నారు. ఈవిషయాన్ని గమనించిన మా ప్రభుత్వం ఎక్కడా కూడా నీటి సమస్య ఉండకూడదని తగు చర్యలు చేపడుతున్నం అని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శేట్కర్,వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మరియు వివేకానంద, తదితరులు పాల్గొన్నారు.