సిద్దిపేట జిల్లా పొన్నాల శివారు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న ట్రాలీ ఆటోను వెనుక వైపు నుంచి ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ట్రాలీ ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా వృద్ధురాలు ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. శతఘాతులను స్థానికులు, ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ ఆటో లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్నది ఒకే కుటుంబానికి చెందినవారుగా స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.