ఆర్‌ఎంపీల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా..

సిద్దిపేట : ఆర్‌ఎంపీలను వేధిస్తున్న వైద్యాధికారులపై అసెంబ్లీలో చర్చిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఆర్‌ఎంపీలు మాజీమంత్రి హరీశ్‌రావును కలిసి వారి సమస్యలను వివరించారు.

దవాఖానల తనిఖీ పేరిట వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీలో మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతానని, ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఆర్‌ఎంపీలు కూడా నిబంధనలు అతిక్రమించకుండా చూసుకోవాలని హితవు పలికారు.