ఝరాసంగం జనవరి 23 సిరి న్యూస్: ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం మారుతున్న గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఎంత మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని, దశాబ్దాలుగా అవస్థలు పడాల్సి వస్తోందని న్యాల్ కల్ మండల పరిధిలోని గుంజేటి గ్రామానికి చెందిన పలువురు యువకులు వాపోయారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కే.మాణిక్ రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అల్లాదుర్గం-మెటల్ కుంట రోడ్డు, ముంగి ఆదిలక్ష్మి దేవాలయం నుండి మొదలు కొని రామతీర్థం మీదుగా హుసేళ్ళి రోడ్డు, హద్నూర్ – రామతీర్థం, గుంజేటి,వడ్డీ-డప్పుర్ రోడ్లను బీటిగా మార్చాలని, అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేపట్టి రోడ్లను మెరుగు పరచాలని విన్నవించారు. గుంజేటి గ్రామం నుండి జహీరాబాద్ కు ఆర్టీసీ బస్సును కొనసాగించాలని కోరారు.సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే యువకులకు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో యువకులు బాలకృష్ణ, శ్రీనివాస్, మహేష్, తదితరులున్నారు.