నర్సాపూర్ జనవరి 25 (సిరి న్యూస్)
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల పథకాలు అమలు చేయాలని ఉద్దేశంతో ప్రజా పాలనలో గ్రామ సభలు నిర్వహణలో భాగంగ నర్సాపూర్ పట్టణంలో ఆంజనేయులు గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి.ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది .ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు ముందుకు సాగుతున్నారు.
దావోస్ లో కొత్త ఒప్పందాలతో తెలంగాణకు రూ.1,78,950 కోట్ల రికార్డు స్థాయి పెట్టుబడులతో 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత రికార్డు స్థాయిలో 16 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి
గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ పెట్టుబడులు వస్తాయి
ప్రభుత్వం రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ,అభివృద్ధి పథకాలు ప్రభుత్వం ప్రకటిస్తుంది అన్నారు. హామీల అమలు విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని,కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తుంది అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసత్య ప్రచారాలను నమ్మి ఆగం కావద్దని ఆయన కోరారు. గ్రామ సభలద్వారా ఎటువంటి అవినీతి, అక్రమాలు తావు లేకుండ పారదర్శకంగా లబ్ధిదారులకు ఎంపిక ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని జాబితాలో పేర్లు రానివారు,రేషన్ కార్డు లబ్ధిదారులు దరఖాస్తు చేయనివారు కూడా తిరిగి గ్రామ సభలలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని,ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, నర్సాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్, సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.