పక్కదారి పడుతున్నా రేషన్ బియ్యం..

Ration rice is falling by the wayside..
బర్ధీపూర్ నుంచి మోపేడలపై రేషన్ బియ్యం తరిలిస్తున్నా దళారులు

…. ఎన్నో పోషకాలు ఉన్న బియ్యం పై లబ్దిదారుల విముఖత..
…. రేషన్ దుకాణాలు, లబ్దిదారుల నుంచి నేరుగా కొనుగోలు..
…. కొరవడిన అధికారుల పర్యవేక్షణ..
….. రోజుకు క్వింటాళ్ల లో తరలింపు..
…..మిల్లరులే దళారులను ఏర్పాటు..

ఝరాసంగం : దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న రేషన్ బియ్యం పక్కా దారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో రోజు కు క్వింటాళ్ల లో రేషన్ బియ్యం తరిలిపోతున్నాయి. మిల్లరులే దళారులను ఏర్పాటు చేసుకుని వారిని గ్రామాల్లో కి పంపుతున్నారు. వీరికి రోజు కు క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేసుకొని వస్తే సుమారు రూ, 300 వందలు చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కొక్కరూ ప్రతి రోజు మూడు క్వింటాళ్ల బియ్యాన్ని టీవిఎస్ ద్విచక్ర వాహనాలపై సంచులలో తరిలిస్తున్నారు. గ్రామాల్లో లబ్దిదారుల నుంచి కాకుండా రేషన్ డీలర్లు నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాట్లు తెలుస్తుంది. కిలో పిడిఎస్ బియ్యం కు రూ, 22 లు చెల్లించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఇంతా రేషన్ బియ్యం దందా ఝరాసంగం మండలంలో కొనసాగుతున్న సంబంధిత అధికారులు అడ్డు కట్ట వేయడం లేదు.

ఝరాసంగం మండలంలోని పలు గ్రామాల నుంచి దళారులు సుమారు 15-20 రేషన్ బియ్యాన్ని టీవిఎస్ ద్విచక్ర వాహనాల పై ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంత మంది రేషన్ డీలర్లు విరితో సంబంధాలు ఏర్పరుచుకొని నేరుగా రేషన్ దుకాణాల వద్ద అమ్మకాలు జరుపుతున్నాట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిలోకు రూ, 15-22 లకు ఉచిత రేషన్ బియ్యం అమ్ముతున్నట్లు తెలుస్తుంది. పిడిఎస్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్న లబ్దిదారులు కూడా విముఖత చూపుతూ దళారులకు అమ్ముతున్నారు. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది రేషన్ డీలర్లు లబ్దిదారులకు బియ్యం ఇవ్వకుండానే వారి చేతి ముద్ర తీసుకొని ఎంతో కొంత చెల్లిస్తున్నారు.కొందురు డీలర్లే సూత్రదారులు మండలంలో కొంత మంది డీలర్లు రేషన్ బియ్యం అక్రమ రవాణా కు సూత్ర దారులగు మారుతున్నారు. డీలర్లు కొనుగోలు దారులతో మధ్య వర్తిత్వం ఏర్పాటు చేసుకొని దుకాణాల వద్దే అమ్మకాలు జరుపుతున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి.