మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగ భహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజి రెడ్డి,మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డిలు వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని,రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వారన్నారు.అధికారంలోకి రాగానే ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటల్ కు రూ. 500 బోనస్ అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిదంగా సంక్రాంతి నుండి రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు 7500 పెట్టుబడి సహాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు.