అమీన్పూర్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మూలంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తోందని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. వి ఫర్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత భోజనం, యూనిఫామ్, పుస్తకాలు అందించడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వి ఫర్ యు ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవ కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ,కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్,కో ఆప్షన్ సభ్యులు తలారి రాములు, సీనియర్ నాయకులు చంద్ర శేఖర్,కొల్లూరు యాదగిరి, వి ఫర్ యు ఫౌండేషన్ అధ్యక్షులు వినోద్ కుమార్, సభ్యులు మల్లికార్జున్, ప్రవీణ్ కుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.