అందోల్ : ఈ రోజు గద్దర్ జయంతి ఈ సందర్భంగా జోగిపేట లో ఘనంగా నివాళులు అర్పించిన BRS నాయకులు మాజీ AMC చైర్మన్ డి బి నాగభూషణం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కీలక భూమిక పోషించిన ఉద్యమ నాయకుడు అన్నారు. తెలంగాణ పోరాటంలో KCR వెంట నడిచిన ఉద్యమకారుడు నిరంతరం ప్రజల ప్రగతి కోసం పరితపించి ప్రజల పక్షాన రైతులు, కార్మికులు పక్షాన నిరంతర పోరాటం చేసిన వెలుగు దివ్య గద్దరన్న అందోల్ నియోజక వర్గంకు అవినాభావ సంబంధాన్ని కల్గిన వ్యక్తి అని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే శ్రీ క్రాంతి కిరణ్ గారికి గద్దర్ అన్న తో సన్నిహిత సంబంధం వుండేది అయన తో ఉన్న సంబంధం తో పలు మార్లు అందోల్ నియోజకవర్గం కు అయన వచ్చాడని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభల్లో పాల్గొన్నడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో చాపల వెంకటేశం, దాసరి దుర్గయ్య, పేండ గోపాల్, రొయ్యల సత్యం, కరుణాకర్, పరిపూర్ణం, శెట్టయ్య, అల్లే గోపాల్, పోసాని పెట కిష్టయ్య, దానం పల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.