★ గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరగాలి..
★ తూతూ ..మంత్రంగా గ్రామసభల నిర్వహణ..
★ కానరాని ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు..
★ బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కాజీపేట రాకేష్..మన తెలంగాణ కౌడిపల్లి
మెదక్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామలలో ప్రజాపాలన పేరుతో తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారని, ప్రజా పాలనల్లో ఇచ్చిన దరఖాస్తులు గ్రామ సభలలో కానరావడంలేదని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు కాజీపేట రాకేష్ ధ్వజమెత్తారు. బుధవారం మండల కేంద్రమైన కౌడిపల్లి లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా ,రైతు భరోసా ,కార్యక్రమలు గురించి నిర్వహించడం జరుగుతుంది. కానీ ఆ గ్రామ సభలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయన్నారు. గ్రామ సభలో దరఖాస్తులు తప్పుడు తడకగా ఉన్నాయని ప్రజాపలన వచ్చిన దరఖాస్తులు గ్రామసభలో కనిపించడం లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క నిజమైన అర్హులను గ్రామసభల్లో గుర్తిస్తాం అన్నారు కానీ క్షేత్రస్థాయిలో అది పూర్తిగా విఫలమైందని అన్నారు. నిజమైన అర్హులు కాకుండా వేరొక పేర్లు రావడం సరికాదన్నారు . గ్రామ సభలకు వచ్చిన అధికారులకి ఎందుకు నిర్వహిస్తున్నారో వాళ్లకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. దరఖాస్తు ల ప్రకారం రేషన్ కార్డు లు,ఇందిరామ్మ ఇల్లు రావాలి కాని.ఇందిరమ్మా ఇల్లు లబ్ది దారుల లిస్ట్ గ్రామ సబలో ఫైనల్ కావడం లేదు.ఇందిరమ్మ కమిటీ ల ఆధారంగా కలెక్టర్ ఆధ్వర్యంలో లో మళ్ళీ లిస్ట్ వస్తుంది. అని వచ్చిన అధికారులు చెప్పడం జరుగుతుంది.గ్రామ సభలో ఫైనల్ చేయకపోతె ఇంకాఎక్కడ చేస్తారు.కాంగ్రెస్ నాయకుల ఇండ్ల లో ఫైనల్ చేస్తారా అని మనిపడ్డారు . ఇందిరమ్మా ఇల్లు కచ్చితంగా గ్రామ సబలో నే ఫైనల్ లిస్ట్ ను చేయాలి అని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరఫున బిజెపి పార్టీ పోరాడుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా చేయాలని డిమాండ్ చేశారు.