ఘ‌నంగా ప్రియాంక గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లు

నంగునూర్‌, జ‌న‌వ‌రి 12 సిరి న్యూస్ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఏంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) జన్మదిన వేడుకలను నంగునూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండి ఇమ్రాన్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ లు సంయుక్తంగా ప్రియాంక గాంధీ జన్మ దిన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్బంగా కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఎండీఇమ్రాన్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, దేశ ప్రజలకు సేవ చేయాలని ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలుపొంది, కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజాన్ని తీసుకవచ్చారనీ ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం చేసున్న అన్యాయాలను ప్రశ్నించడంతో ప్రియాంక గాంధీ ముందుటారని పేర్కొన్నారు. ఇందిరమ్మ పోలికలనే కాకుండా ఆమె ధైర్య సాహసాలను పునికి పుచ్చుకున్నారనీ, ప్రియాంక గాంధీని నేటితరం ఇందిరా గాంధీగా కీర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బడే అశోక్ ,పోల్ రెడ్డి నగేష్ ,శ్రీధర్ బడే నవీన్ , వివేక్, గోపి,అజయ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు