అక్కన్నపేటలో ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

రామాయంపేట జనవరి 11 (సిరి న్యూస్) : మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట (Akkannapet) గ్రామంలో అక్కన్నపేట ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ (Premium League Cricket Tournament) యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమార్ సాగర్ ఆధ్వర్యంలో శనివారం రోజు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కుమార్ సాగర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని క్రికెట్ ఆడి విజేతలుగా నిలిచేందుకే వారిని ప్రోత్సహించేందుకు ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

ఈ క్రికెట్ టోర్నమెంట్ లో నాలుగు టీమ్ లు పాల్గోనడం జరిగిందని తెలిపారు.ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 11వ తేది నుండి 15వ తేది వరకు గ్రామంలో ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ టోర్నమెంట్ లో మొదటి రోజు కేపీఎస్ టీమ్ విజేతగా నిలిచిందని వెల్లడించారు.ఐదు రోజుల పాటు జరిగే క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామీణ క్రీడాకారులు,వివిధ గ్రామాల ప్రజలు వీక్షించి విజయవంతం చేయాలని తెలిపారు.