విజయవంతం గా ముగిసిన 140 కిలోమీటర్ల పాదయాత్ర.
కెసిఆర్ సార్ మళ్ళీ ముఖ్య మంత్రి గా రావాలని పూజలు,
సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఝరాసంగం ఫిబ్రవరి 1 సిరి న్యూస్ :
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేధపల్లి సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం గా ముగిసింది ఈ సందర్బంగా మాట్లాడుతూ సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ని కలవడానికి ఝరాసంగం కేతకి సంగమేశ్వరుని ఆశీస్సులతో చేపట్టిన 140కిలోమీటర్ల పాదయాత్ర ను విజయ వంతం చెయ్యడానికి నాకు సహకరించిన స్థానిక శానససభ్యులు మాణిక్ రావు,ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం లకు ధన్యవాదాలు తెలిపారు .
కెసిఆర్ అభిమానుల బృందం తో చేపట్టిన పాదయాత్ర ప్రశాంతంగా ముగిసింది అని అందుకు సహకరించిన ఝరాసంగం జహీరాబాద్ నియోజకవర్గ బి ఆర్ యస్ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదలు తెలియజేశారు పరమేశ్వర్ పాటిల్ మాట్లాడుతూ మాకు పాదయాత్రలో ఎక్కడ లోటు రానీయకుండా సహకరించి కేసీఆర్ తో మాట్లాడటానికి ఒక గొప్ప అవకాశం లభించింది అని వచ్చే స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా బి ఆర్ ఎస్ పార్టీ విజయాలు సొంతం చేసుకుంటుంది అని పార్టీ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, స్థానిక ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాచరణ, ప్రణాళిక లపై అనేక సూచనలు చేసారని దాని పరంగా ప్రతి ఒక్కరం ముందుకు వెళ్తామని అన్నారు.
.