ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వం విఫలం చింత ప్రభాకర్ ఎమ్మెల్యే సంగారెడ్డి

సంగారెడ్డి, మే 15 (సిరి న్యూస్):కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై శ్రద్ధ లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలం కొనాపూర్ గ్రామంలో తడిసిన ధ్యాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సక్రమంగా ధాన్యం సేకరణ చేపట్టక పోవడం వల్లే రైతులు నష్టపోయారని అన్నారు. ఎద్దుఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు లేదు, అధికారుల నిర్లక్ష్యం సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. నామమాత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవన్నారు. టార్పాలిన్లు లేక ధాన్యం తడిసిందన్నారు. తడిసిన ధాన్యన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యపు రాశుల చుట్టూ తిరగాల్సిన వారు అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ రాజు, పాండు, పవన్, నాగేష్ అధికారులు పాల్గొన్నారు.