- కందులకు మద్దతు ధర రూ.7550 అందిస్తున్నాం.
- సన్నవడ్లకు రూ.500బోనస్ ఇచ్చాం.
- జనవరి 26 నుండి రైతుభరోసా అమలు.
- భూమిలేని ఉపాధి కూలీలకు రూ.12 వేలు ఇస్తాం.
- ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుంది.
- కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం.
- కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం.
సిద్దిపేట, జనవరి 17 సిరి న్యూస్ః
కందులకు మద్దతు ధర రూ.7550 అందిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

శనివారం నాఫెడ్ / టిజి మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాట్లాడారు. కందుల మద్దతు ధర 7550 రూపాయలతో ప్రభుత్వం కందుల కొనుగోలు చేస్తుందని రైతులు కందులను మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు.గతంలో వడ్లు , పత్తి ,సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించామని వడ్ల కొనుగోలు చేసిన 48 గంటలలో పేమెంట్ చేశామని తెలిపారు.సన్న వడ్ల కు 500 బోనస్ ఇచ్చాం. జనవరి 26 నుండి వ్యవసాయ యోగ్యమైన భూములు రైతు భరోసా ఇస్తున్నామని రైతు భరోసా 12 వేలకు పెంచామన్నారు.భూమిలేని ఉపాధి కూలీలకు 12 వేలు ఇస్తున్నామని అన్నారు..ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు.గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు.కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు.పేర్ల మార్పిడి చేసుకోవాలనుకునే వారు చేసుకోవచ్చన్నారు.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం..త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఇక్కడ పర్యటించి అయిల్ ఫాం సాగు పై రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు ,సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య ఇతర అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు